ఐబీ రియల్ ఎస్టేట్ కొనండి
ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జయ్ ఠక్కర్ జీ బిజినెస్ ఛానల్‌తో మాట్లాడుతూ మూడు షేర్లను.. మూడు భిన్న ఇన్వెస్టర్లకు సూచించారు. దీర్ఘాకాలిక ఇన్వెస్టర్లకు జిందా సా షేర్‌ను ఈయన సిఫారసు చేస్తున్నారు. ఈ షేర్ ప్రస్తుతం రూ.104.75 వద్ద ట్రేడవుతోంది. రూ. 72 స్టాప్‌లాస్‌తో ఈ షేర్‌ను దీర్ఘకాలానికి (9 నుంచి 12 నెలలు) కొనుగోలు చేయొచ్చని…టార్గెట్ రూ.170 అని జయ్ ఠక్కర్ తెలిపారు. మిడ్‌క్యాప్‌లో మిడ్ టర్మ్ ఇన్వెస్టర్లకు ఆయన గుజరాత్ అంబుజా ఎక్స్‌పోర్ట్స్ షేర్‌ను కొనుగోలు చేయమని సలహా ఇచ్చారు. ఈ షేర్ ప్రస్తుతం రూ. 171 వద్ద ట్రేడవుతోంది. ఈ షేర్‌ను రూ. 135 స్టాప్‌లాస్‌తో హోల్డ్ చేయొచ్చని… మూడు నుంచి ఆరు నెలల్లోగా ఈ షేర్ రూ. 240 లేదా రూ. 260కి చేరుతుందని ఆయన చెప్పారు.ఇక స్వల్ప కాలానికి ఆయన ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ షేర్‌ను సిఫారసు చేస్తున్నారు. ఈ షేర్ ప్రస్తుతం రూ. 164.95 వద్ద ట్రేడవుతోంది. నెల లేద మూడు నెలల్లోగా ఈ షేర్ రూ. 196కు చేరే అవకాశముందని, స్టాప్ లాస్ రూ.154గా ఉంచుకుని ఈ షేర్లో ట్రేడ్ చేయొచ్చని ఆయన సలహా ఇస్తున్నారు.
शॉर्ट टर्म, पोजीशनल और लॉन्ग टर्म के लिए जय ठक्कर के 3 बेहतरीन मिडकैप Picks
Short Term- IB Real Estate
Positional Term- Gujarat Ambuja Exports
Long Term- Jindal Saw#SPLMidcapStocks | #MidcapStocks | #StocksToBuy @AnilSinghvi_ | @JayThakkar22 pic.twitter.com/1ZBvbtIreB
— Zee Business (@ZeeBusiness) January 7, 2022