హైదరాబాద్‌లో కుబేరులు పెరుగుతున్నారు
కనీసం 3 కోట్ల డాలర్ల (దాదాపు రూ.226 కోట్లు) సంపద కలిగిన అల్‌ట్రా హైనెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (UHNI) హైదరాబాద్‌లో 467 మంది ఉన్నారని నైట్‌ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2022 వెల్లడించింది. 1596 మందితో ముంబై నంబర్ వన్ స్థానంలో ఉండగా, రెండో స్థానంలో హైదరాబాద్ నిలిచింది. 2026 నాటికి హైదరాబాద్ నగర కుబేరుల సంఖ్య 56 శాతం పెరిగి 728కి చేరుకోవచ్చని నైట్‌ఫ్రాంక్ అంచనా వేసింది. దేశ వ్యాప్తంగా ఈ నయా కుబేరుల సంఖ్య భారీగా పెరగడానికి కారణం… స్టాక్ మార్కెట్ల జోరు, డిజిటల్ విప్లవం కారణమని నైట్‌ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ అన్నారు. 2026 నాటికి భారత అలా్ట్ర హై నెట్‌వర్త్ వ్యక్తులు 39 శాతం పెరిగి 19,006కు చేరుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. 2016లో వీరి సంఖ్య కేవలం 7,401 మంది ‘యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐ’లు ఉండగా.. అంటే ఐదేళ్లలో వీరి సంఖ్య 84 శాతం పెరిగిందన్నమాట.