సర్ఫ్, రిన్, విమ్, లక్స్.. ధరల పెంపు
హిందుస్థాన్ లీవర్ లిమిటెడ్ తన ఉత్పత్తుల ధరలను పెంచింది. ముడి పదార్థాల ధరలు పెరగడంతో పాటు వ్యయాలు పెరిగినందున ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. గడచిన పది రోజులుగా హెచ్యూఎల్ తన ఉత్పత్తుల ధరలను విడతల వారీగా పెంచుతూ వచ్చింది.
సర్ఫ్ ఎక్సెల్ క్విక్ వాష్ (కిలో) దర రూ.229 నుంచి రూ. 235కు పెంచింది.
సర్ఫ్ ఎక్సెల్ క్విక్ వాష్ సాచెట్ ధర రూ.2 నుంచి రూ. 3లకు అంటే 50 శాతం పెంచింది.
రిన్ పౌడర్ (ఒక కిలో) ధర రూ. 92 నుంచి రూ. 95కు పెంచింది
విమ్ బార్ (250 గ్రాములు)ధర రూ. 27 నుంచి రూ.29కు పెంచింది.
పియర్స్ బండిల్ ప్యాక్ ధర రూ. 140 నుంచి రూ. 152కు పెరిగింది
లక్స్ సబ్సు ధర రూ. 36 నుంచి రూ. 37
డవ్ బాడీవాష్ ధర రూ.120 నుంచి 125కు పెంపు
సెన్సొడైన్ పేస్ట్ (ఫ్రెష్జెల్) 150 గ్రాముల ప్యాక్ ధర రూ.190 నుంచి రూ. 210లకు పెంచింది.