హువావేపై దాడులు…నల్లధనం వెలికితీత
చైనా టెలికాం కంపెనీ హువావేపై ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో రూ. 400 కోట్ల నల్లదనం బయటపడింది. వాస్తవ ఆదాయాన్ని తక్కువ చేసి చూపుడానికి పుస్తకాల్లో తప్పుడు ఎంట్రీలు చూపారని సీబీడీటీ పేర్కొంది. గతనెల 15వ తేదీన ఈ కంపెనీ కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కంపెనీ పేరు పేర్కొనకుండా సీబీడీటీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. టెక్నికల్ సర్వీసు పేరుతో గత అయిదేళ్ళలో దాదాపు రూ.129 కోట్లను ఖాతాల్లో చూపిందని సీబీడీటీ పేర్కొంది. ఆదాయాన్ని తక్కువగా చూపేందుకు భారీ మొత్తాన్ని ఖర్చుగా చూపారని తెలిపింది. అలాగే మాతృ సంస్థకు రూ.350 కోట్లను రాయల్టీగా చెల్లించినట్లు హువావే పేర్కొంది. మొత్తం రూ. 400 కోట్ల ఆదాయాన్ని ఈ కంపెనీ దాచిందని సీబీడీటీ పేర్కొంది.