వాల్‌స్ట్రీట్‌కు సెలవు
అమెరికాలో ఇవాళ ఈక్విటీ మార్కెట్లకు సెలవు. ఫ్యూచర్స్ మాత్రం గ్రీన్‌లో ఉన్నాయి. ఎస్ అండ్ పీ 500 సూచీ ఒక శాతంపైగా లాభంతో ఉంది. కరెన్సీ మార్కెట్‌లో డాలర్ స్వల్ప నష్టాలతో ఉంది. అలాగే పదేళ్ళ అమెరికా బాండ్స్ ఈల్డ్స్ కూడా స్వల్ప నష్టంతో ఉన్నాయి. అయితే క్రూడ్ మాత్రం మళ్ళీ గ్రీన్‌లోకి వచ్చింది. బ్రెంట్ క్రూడ్ 114 డాలర్ల సమీపంలో ఉంది. అంత క్రితం యూరో మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. కీలకమైన జర్మనీ డాక్స్ ఒక శాతం లాభపడగా, ఫుట్సి 100 సూచీ 1.5 శాతం లాభపడింది. యూరో మార్కెట్లన్నీ ఒక మోస్తరు లాభాలతో ముగిశాయి. ఇక బులియన్ మార్కెట్‌లో పెద్ద మార్పుల్లేవు.