హెచ్ఎంఏ ఆగ్రో లిస్టింగ్ రేపే!
బొటాబొటిన సబ్స్క్రిప్షన్ పొందిన హెచ్ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్ షేర్లు రేపు లిస్ట్ కానున్నాయి. ఈ పబ్లిక్ ఆఫర్లో కంపెనీ రూ. 585 ధర వద్ద షేర్లను అలాట్ చేసింది. మొదటి రెండు రోజులు సబ్స్క్రిప్షన్ నిరుత్సాహంగా ఉండగా… చివరి రోజున పెద్ద ఇన్వెస్టర్లు కాపాడారు. రీటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన కోటాలో 96 శాతానికి మాత్రమే సబ్స్క్రిప్షన్ వచ్చింది. అంటే దరఖాస్తు చేసినవారందరికీ షేర్లు అలాట్ అయ్యాయన్నమాట. మొన్నటి దాకా ఈ ఆఫర్‌కు గ్రే మార్కెట్లో పెద్ద ఆసక్తి లేదు. రూ. 10 ప్రీమియంతో లిస్ట్ కావొచ్చని భావించారు. అయితే ఇపుడు గ్రే మార్కెట్లో రూ. 40 పలుకుతున్నట్లు సమాచారం. అయితే ఇష్యూ 1.62 రెట్టు మాత్రమే స్స్క్రయిబ్ అయింది. ఎన్ఐఐలకు కేటాయించిన కోటా 2.97 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రయిబ్ అయింది. అలాగే క్యూఐబీ కోటాకు 1.74 రెట్ల ఆదరణ లభించింది. ఈ రెండు కేటగిరీలలో షేర్లు పొందని వారు రేపు లిస్టింగ్ రోజున ఈ షేర్‌ను కొంటారా అన్నది చూడాలి. మధ్య కాలిక లాభాలు ఆశించే వారికి మంచి షేర్ అని అనలిస్టులు అంటున్నారు. మార్కెట్ మూడ్ ఇపుడు బాగున్నందున…ఈ షేర్ స్వల్ప ప్రీమియంతో లిస్ట్ కావొచ్చు. అయితే మార్కెట్ గడ్డు రోజుల్లో ఈ షేర్ తక్కువ ధరకు లభించే అవకాశముంది. కొద్ది రోజులు ఆగి ఈ షేర్‌ను ఇష్యూ ధరకు లేదా కాస్త ధరకు కొనవచ్చని అనలిస్టులు అంటున్నారు. కంపెనీ వ్యాపార పరంగా మంచి ట్రాక్ రికార్డు ఉండటమే దీనికి కారణం.