For Money

Business News

కొనేందుకు కార్లు లేవు… బైక్స్‌ ఉన్నా కొనేవారు లేరు

సెమి కండక్టర్స్‌, ఏబీఎస్‌ చిప్స్‌ కొరత కారణంగా అనేక మంది తమకు నచ్చిన కారును కొనలేకపోతున్నారు. వీటి కొరత కారణంగా అనేక కంపెనీలు ఉత్పత్తిని ఆపేశాయని.. దీంతో కార్లకు వెయిటింగ్‌ పీరియడ్‌ పెరుగుతోంది. ఐటీ, రియల్ ఎస్టేట్‌తో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు బాగుండటంతో ఎగువ మధ్య తరగతి నుంచి డిమాండ్‌ బాగుంది. స్టాక్‌ మార్కెట్‌లో బుల్‌ రన్‌ కారణంగా కూడా కార్లకు డిమాండ్‌ బాగా ఉంటోంది.ఆగస్టులో ఆటోమొబైల్‌ వాహనాల అమ్మకాలు 14.48 శాతం పెరిగి 13,84,711కు చేరాయి. గత ఏడాది కరోనా అమ్మకాలు దారుణంగా ఉన్నందున ఇపుడు వృద్ధి కన్పిస్తోంది. వాస్తవానికి కోవిడ్‌ ముందు నాటి అమ్మకాలకు ఇంకా చేరలేదు. ముఖ్యంగా కార్లకు డిమాండ్‌ బాగా ఉంది. ఆగస్టు నెలలో ప్యాసింజర్‌ కార్ల అమ్మకాలు 39 శాతం దాకా పెరిగాయి. గత ఏడాదిలో 1,82,651 కార్లు అమ్ముడుపోగా… ఈసారి ఇదే నెలలో 2,53,363 కార్లను అమ్మారు. డిమాండ్‌ ఉన్నా సరఫరా చేయలేకపోతున్నట్లు కంపెనీ తెలిపాయి. అయితే టూ వీలర్‌ అమ్మకాలు మాత్రం కేవలం 6.6 శాతం మాత్రమే అభివృద్ది చెందాయి. దిగుమ మధ్య తరగతి ప్రజల ఆదాయం తగ్గడం, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో పాటు కాలేజీల సెలవు కారణంగా కొత్త తరం కూడా టూవీలర్స్‌ కొనడం లేదని కంపెనీలు అంటున్నాయి. విద్యా సంస్థలు తెరిస్తే డిమాండ్ కాస్త పెరగవచ్చని భావిస్తున్నాయి.