హెటిరో చేతికి జాన్సన్ ప్లాంట్
అమెరికా కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్‌కు హైదరాబాద్‌లో ఉన్న ప్లాంట్‌ను హెటిరీ గ్రూప్ కొనుగోలు చేసింది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని పెంజెర్లలో ఉన్న జాన్సన్ ప్లాంట్‌ను హెటిరో డ్రగ్ రూ.130 కోట్లకు కొనుగోలు చేసింది. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీకేర్ ఉత్పత్తుల తయారీకి 55.27 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పిన ఈ సదుపాయాన్ని ఫార్మా ఉత్పాదక ప్లాంట్‌గా అప్‌గ్రేడ్ చేసేందుకు, విస్తరించేందుకు దాదాపు రూ. 600 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు హెటిరో మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వంశీకృష్ణ బండి తెలిపారు. 2000 కొత్త ఉద్యోగాల్ని కల్పించే లక్ష్యంతో ఉన్నామని ఆయన చెప్పారు.