For Money

Business News

హోండా గ్రేజియా 125 @ రూ.87,138

హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) 125 సీసీ స్కూటర్‌ గ్రేజియా రెప్సాల్‌ ప్రత్యేక ఎడిషన్‌ను మార్కెట్‌కి తెచ్చింది. దీని ధర రూ.87,138 (ఎక్స్‌-షోరూమ్‌). ఈ స్కూటర్‌ను దేశీయంగా రేసింగ్‌ ఔత్సాహికుల కోసం విడుదల చేసినట్లు కంపెనీ తెలిపింది. రెప్సోల్‌ హోండా రేసింగ్‌ టీంను స్పూర్తిగా తీసుకొని ఈ వాహనాన్ని తీర్చిదిద్దారు. భారత్‌లో రేసింగ్‌ అభిమానులకోసం ఈ మోడల్‌ను పరిచయం చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 125 సీసీ ఇంజిన్‌తో తయారైన ఈ స్కూటర్‌లో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌, ఇంటిగ్రేటెడ్‌ స్విచ్‌, సైడ్‌ స్టాండ్‌ ఇండికేటర్‌ సదుపాయం ఉంది. సైడ్‌ స్టాండ్‌ తీయకపోతే ఇంజన్‌ స్టార్ట్‌ కాని విధంగా ఈ స్కూటర్‌ను తీర్చిదిద్దినట్లు ఆ వర్గాలు తెలిపాయి.