NIFTY TODAY: అన్నీ సెల్ సిగ్నల్స్
నిఫ్టి క్రితం ముగింపు 17674. ఇవాళ ఓపెనింగ్‌లోనే నిఫ్టి 17500 ప్రాంతానికి వచ్చేలా ఉంది. టీసీఎస్ పుణ్యమా అని ఐటీ రంగం నిలబడితే పర్లేదు. ఒకవేళ ఈ రంగంలో కూడా అమ్మకాల ఒత్తిడి వస్తే మాత్రం నిఫ్టిలో డౌన్ ట్రెండ్ ఖాయంగా కన్పిస్తోంది. రేపు వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ కావడంతో ఇన్వెస్టర్లపై ఒత్తిడి అధికంగా ఉంది. పైగా మార్కెట్ రేపటితో క్లోజ్. మళ్ళీ సోమవారమే. 17800 వద్ద కాల్‌రైటింగ్ అధకంగా ఉండటంతో… ఆ స్తాయికి రావడం కష్టమని అనలిస్టులు అంటున్నారు. బ్యాంక్ నిఫ్టిపైనే కాస్త ఆశలు ఉన్నాయి. అమెరికా ఫ్యూచర్స్ భారీ నష్టాలు చూపుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని అనలిస్టులు హెచ్చరిస్తున్నారు. నిఫ్టికి వెంటనే 17560 ప్రాంతంలో మద్దతు అందాలి… లేదంటే 17500ని తాకే అవకాశాలు అధికంగా ఉన్నాయి. రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు మాత్రమే దిగువ స్థాయిలో కొనండి. లేదంటే మార్కెట్‌కు దూరంగా ఉండటం మంచిది.