మళ్ళీ భారీ నష్టాలు

వాల్‌స్ట్రీట్‌లో మళ్ళీ అమ్మకాలు వెల్లువెత్తాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల ప్రభావంతో పాటు ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జరోమ్ పావెల్‌ను డిస్మిస్ చేస్తారనే వార్తలతో వాల్‌స్ట్రీట్‌లో అమ్మకాలు జోరందుకున్నాయి. తాజా సమాచారం మేరకు నాస్‌డాక్ మూడు శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీతోపాటు డౌజోన్స్ సూచీలు 2.8 శాతం మేర క్షీణించాయి. రానున్న 90 రోజుల్లో మెజారిటీ దేశాలతో తమతో డీల్‌కు సిద్ధంగా ఉన్నాయన్న ట్రంప్ మాటలను ఆర్థికవేత్తలు నమ్మడం లేదు. పైగా వడ్డీ రేట్లను తగ్గించాలని ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్‌ను బెదిరించడం కూడా మార్కెట్‌కు నచ్చలేదు. పదవీకాలం ముగియముందే పావెల్‌ను డిస్మస్ చేసే అంశాన్ని ట్రంప్ పరిశీలిస్తున్నట్లు ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు. స్వయంగా ట్రంప్ తన ఎక్స్ ఖాతాలో వడ్డీ రేట్లను తగ్గించాలంటే పావెల్‌ను బెదిరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ బడా కంపెనీల ఫలితాలు ఈ వారం వెలువడనున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ముందు జాగ్రత్తగా లాభాలు స్వీకరిస్తున్నారు.