For Money

Business News

టెక్‌ షేర్లలో భారీ అమ్మకాలు

నిన్న అమెరికా మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ద్రవ్యోల్బణం 31 ఏళ్ళ గరిష్ఠ స్థాయికి చేరడంతో డాలర్‌ రాత్రి రికార్డు స్థాయిలో పెరిగింది. ఏక్షణమైనా డాలర్‌ ఇండెక్స్‌ 95కు చేరనుంది. దీంతో టెక్నాలజీ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. నాస్‌ డాక్‌ ఏకంగా 1.66 శాతం క్షీణించగా, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.8 శాతం, డౌజోన్స్‌ 0.66 శాతం క్షీణించాయి. ద్రవ్యోల్బణం పెరగడంతో వడ్డీ రేట్లు పెరగడం ఖాయమని, దీని ప్రభావం మార్కెట్లపై ఉంటుందని అనలిస్టులు హెచ్చరించారు. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. డాలర్‌ పడటం ఇక్కడి కరెన్సీలకు కలిసొచ్చింది. జపాన్‌నిక్కీ 0.89 శాతం లాభంతో ట్రేడవుతోంది. చైనా మార్కెట్లన్నీ గ్రీన్లో ఉన్నాయి. ఒక శాతం లాభాలతో ఉన్నాయి. ఇక హాంగ్‌సెంగ్‌ స్థిరంగా ఉంది. సింగపూర్‌ నిఫ్టి స్వల్ప నష్టంతో ఉంది. నిఫ్టి కూడా స్థిరంగా లేదా స్వల్ప నష్టాలతో ప్రారంభం కానుంది.