హెచ్డీఎఫ్సీ లాభం 5,837 కోట్లు
డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో హెచ్డీఎఫ్సీ రూ.5,837 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.5,177 కోట్లతో నికర లాభంతో పోలిస్తే ఇది 13 శాతం అధికమని సంస్థ పేర్కొంది. అయితే కంపెనీ ఆదాయం మాత్రం రూ.39,268 కోట్ల నుంచి రూ.31,308 కోట్లకు తగ్గినట్లు వెల్లడించింది. సెప్టెంబర్ త్రైమాసికంతో అంటే రెండో త్రైమాసికంలో కంపెనీ ఆదాయంతో రూ.38,604 కోట్లతో పోలిస్తే ఆదాయం భారీగా తగ్గినట్లే. కంపెనీ స్టాండ్ అలోన్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 11 శాతం పెరిగి రూ.3,261 కోట్లుగా నమోదైంది. అలాగే నికర వడ్డీ ఆదాయం రూన. 4005 కోట్ల నుంచి రూ. 4284 కోట్లకు చేరింది. మొత్తం స్థూల ఎన్పీఏలు 2.32 శాతానికి అంటే రూ. 12,413 కోట్లకు చేరాయి.