హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో పే టీఎం జత
కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల జారీకి పేటీఎంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ జత కట్టింది. ముఖ్యంగా చిన్న వ్యాపార సంస్థలు, వ్యాపారస్థులను టార్గెట్ చేస్తూ వీసాతో కలిసి ఈ కో బ్రాండెడ్ కార్డులను జారీ చేస్తారు. ఈఎంఐలు, బై నౌ పే లేటర్ వంటి ఆప్షన్స్‌తో పాటు రివార్డు పాయింట్లను ఈ రంగంలో ఇప్పటి వరకు ఎవరూ ఇవ్వని ఆఫర్స్‌ను ఈ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల ద్వారా అందించునన్నారు. ఈ కార్డుల జారీ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. పండుగల సీజన్ కావడంతో కొత్త ఆఫర్స్‌తో వీటిని విడుదల చేస్తున్నారు. అన్ని రకాల స్కీమ్‌లను డిసెంబర్ కల్లా ప్రవేశ పెట్టనున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంత కస్టమర్లను టార్గెట్ చేస్తూ ఈ కార్డులను మార్కెట్ చేయనున్నారు.