హెచ్‌సీఎల్ టెక్ లాభం రూ.3,442 కోట్లు
డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.3,442 కోట్లకు తగ్గింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో కంపెనీ ఆర్జించిన నికర లాభం రూ.3,969 కోట్లు. గత ఏడాది కంపెనీకి 6 కోట్లడారల్ల ట్యాక్స్ బెనిఫిట్ వచ్చింది.ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే కంపెనీ మంచి పనితీరు కనబర్చినట్లే. అంతక్రితం త్రైమాసికం (జూలై-సెప్టెంబరు)తో పోలిస్తే నికర లాభంతో 5 శాతం, టర్నోవర్ 7.6 శాతం చొప్పున పెరిగాయి. మూడో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 15 శాతం వృద్ధి చెంది రూ.22,331 కోట్లకు పెరిగింది. ఒక్కో షేరుకు రూ.10 మధ్యంతర డివిడెండ్ చెల్లించాలని కంపెనీ నిర్ణయించింది. మూడో త్రైమాసికంలో కంపెనీ 213.5 కోట్ల డాలర్ల విలువైన కొత్త కాంట్రాక్ట్‌లను దక్కించుకుంది. గడిచిన 3నెలల్లో కంపెనీ 10,143 మందిని ఉద్యోగంలో చేర్చుకుంది. దీంతో సిబ్బంది సంఖ్య 1,97,777కు చేరుకుంది. డిసెంబర్ నాటికి గత ఏడాదిలో 17,500 మంది ఫ్రెషర్లను తీసుకున్నారు.