For Money

Business News

అంచనాలు తప్పిన హెచ్‌సీఎల్‌ టెక్‌

ఈసారి ఐటీ కంపెనీలలో హెచ్‌సీఎల్‌ టెక్‌పై చాలా మంది ఇన్వెస్టర్లు సానుకూల ఫలితాలు వస్తాయని భావించారు. కంపెనీ ఫలితాలు మాత్రం మార్కెట్‌ విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 26,296 కోట్ల టర్నోవర్‌పై రూ. 3,534 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఈటీ నౌ న్యూస్‌ ఛానల్‌ నిర్వహించిన పోల్‌లో కంపెనీ రూ. 26,810 కోట్ల ఆదాయంపై రూ. 3,792 కోట్ల నికర లాభాన్ని ఆర్జిస్తుందని అంచనా వేశారు. రెండు అంశాల్లో కంపెనీ అంచనాలను అందుకోలేకపోయింది. కంపెనీ రూ. 10 తాత్కాలిక డివిడెండ్‌ను ప్రకటించింది. రికార్డ్‌ తేదీ జులై 20. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 18 భారీ ఆర్డర్లను సాధించామని, వీటి విలువ 160 కోట్ల డాలర్లని కంపెనీ పేర్కొంది. కంపెనీ మార్జిన్‌ 17 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం తమ కంపెనీలో 2,23,438 మంది పనిచేస్తున్నారని కంపెనీ తెలిపింది. ఈ త్రైమాసికంలో 2506 మంది ఉద్యోగులు కంపెనీ నుంచి వెళ్ళిపోగా, 1597 మంది ఫ్రెషర్స్‌ను తీసుకున్నట్లు హెచ్‌సీఎల్‌ టెక్‌ పేర్కొంది.