జీ ప్రమోటర్లకు బాంబే హైకోర్టులో చుక్కెదురు
జీ ఎంటర్టైన్మెంట్ సీఈఓ పునీత్ గోయెంకాను తొలగించేందుకు అత్యవసర వాటాదారుల సమావేశం నిర్వహించాలని జీ బోర్డుకు ఆ కంపెనీలో అతి పెద్ద వాటాదారు అయిన ఇన్వెస్కో డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ నోటీసు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ ముంబై హైకోర్టును ఆశ్రయించగా ఇన్వెస్కో ప్రతిపాదనపై సింగిల్ జడ్జి బెంచ్ స్టే ఇచ్చింది .దీన్ని ఇన్వెస్కో సవాలు చేసింది. ఇన్వెస్కో అప్పీల్‌ను పరిశీలించిన డివిజన్ బెంచ్ స్టే ఉత్తర్వులను తొలగించింది. జస్టిస్ ఎస్జే కథవాలా, జస్టిస్ మిలింద్ జాదవ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ 2021 అక్టోబర్‌లో సింగిల్ బెంచ్ ఉత్తర్వులను పక్కన బెట్టింది. జీ బోర్దుకు ఇన్వెస్కో నోటీసును ఇవ్వడం చట్ట వ్యతిరేకం కాదని తేల్చింది. అయితే మూడు వారాలు స్టేటస్ కోకు అనుమతి ఇవ్వాలని జీ లాయర్ విజ్ఞప్తిని కోర్టు అంగీకరిస్తూ… సింగిల్ బెంచ్ మొత్తం ఉత్తర్వులను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పునిత్ గోయెంకాతో పాటు మిగిలిన ఇద్దరు డైరెక్టర్లను తొలగించేందుకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని ఇన్వెస్టకో నోటీసు ఇచ్చిన విషయం తెలిసింది. హైకోర్టు తీర్పుతో జీ ఎంటర్టైన్మెంట్ షేర్ ఎన్ఎస్ఈలో నాలుగు శాతం నష్టంతో ట్రేడవుతోంది.