అదరగొట్టిన హిందుస్థాన్ లీవర్
సెప్టెంబరు త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన హిందుస్థాన్ యునిలీవర్ (HUL) రూ .2,670 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసిక లాభం రూ.2.185 కోట్లతో పోలిస్తే ఇది 22.19 శాతం అధికం. అమ్మకాలు కూడా 16.44 శాతం పెరిగి రూ .13,099 కోట్ల నుంచి రూ .15,253 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు రూ.10.129 కోట్ల నుంచి 18.12 శాతం పెరిగినా… మార్జిన్‌ను కంపెనీ కాపాడుకోగలిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో కంపెనీ టర్నోవర్‌ను రూ .4,000 కోట్లకు పైగా పెంచుకున్నామని కంపెనీ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతా అన్నారు. ప్రథమార్ధంలో కంపెనీ నికర లాభం 18.1 % పెరిగి రూ .5,061 కోట్లకు చేరింది. ఒక్కో షేరుకు రూ.17 మధ్యంతర డివిడెండు చెల్లించేందుకు కంపెనీ బోర్డు సిఫారసు చేసింది.