హిందుజా గ్లోబల్ మళ్ళీ జూమ్…
కంపెనీ కీలక విభాగాన్ని అమ్మేసిన తరవాత స్పెషల్ డివిడెండ్ రూపంలో కేవలం రూ. 150లు మాత్రమే చెల్లించడంతో హిందుజా గ్లోబల్ సొల్యూసన్స్ కంపెనీ కౌంటర్లో తీవ్ర ఒత్తిడి వచ్చిన విషయం తెలిసిందే. కంపెనీ వద్ద ఉన్న నగదు నిల్వల నుంచి గ్రూప్ కంపెనీలకు బదిలీ చేస్తున్నారని కూడా ఇన్వెస్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ కంపెనీ షేర్లో తీవ్ర ఒత్తిడి వచ్చింది. అయితే కంపెనీ షేర్లను బైబ్యాక్ చేసే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకునేందుకు ఈనెల 14న కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశం అవుతోంది. ఎన్ని షేర్లు బై బ్యాక్ చేయాలి?ఎపుడు బై బ్యాక్ చేయాలనే అంశంపై కూడా ఈ బోర్డు సమావేశంలో నిర్ణయిస్తారు. ఈ ప్రతిపాదనతో పాటు విలీనం లేదా టేకోవర్ అంశాలను కూడా ఈ బోర్డు సమావేశంలో పరిశీలించనున్నారు. దీంతో ఇవాళ ఆ కంపెనీ షేర్ ఏకంగా 5 శాతం పెరిగి రూ. 2984న తాకింది. కంపెనీ ట్రేడింగ్ వ్యాల్యూ చూస్తే ఎన్ఎస్ఈలో డెలివరీస్ కూడా 65 శాతంపైనే ఉన్నాయి.