దుబాయ్‌లో గుప్తా సోదరుల అరెస్ట్
ప్రభుత్వ పెద్దల అండతో చాలా త్వరగా కోట్లకు పడగెలెత్తిన పారిశ్రామిక వేత్తలకు కాస్త ఆలస్యంగానైనా చట్టం చేతికి తప్పదు. దక్షిణాఫ్రికాలో జాకోబ్ జుమా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో గుప్తా సోదరులైన..రాజేష్ గుప్తా, అతుల్ గుప్తాలో జెట్ స్పీడుతో అనేక పరిశ్రమలు స్థాపించి జెట్ స్పీడ్‌తో ఎదిగారు. వారి కుంభకోణాల గురించి మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. అక్రమ మార్గాల్లో ఆర్థికంగా బలపడ్డారని, ప్రభుత్వ వ్యవహారాల్లో తలరూర్చారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి. కాని జాకోబ్ ఉన్నంత వరకు చట్టం నుంచి తప్పించుకున్నారు. జాకోబ్ మాజీ అయ్యాక గుప్తా సోదరుల కష్టాలు ప్రారంభమయ్యాయి. వీరిద్దరిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన పోలీసు అధికారులు అరెస్ట్ చేశారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా అందాల్సి ఉంది.