For Money

Business News

పెరగనున్న జీఎస్టీ రేట్లు?

జీఎస్టీ రేట్లలో మార్పులు, చేర్పులు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ మార్పుల వల్ల జీఎస్టీ రేట్లు మరింత పెరగనున్నాయి. ఇపుడు నాలుగు రేట్లు అమలు చేస్తున్నారు. ఆహార వస్తువులపై 5 శాతం, 12 శాతం కాగా, విలాస వస్తువుల, సిన్‌ ట్యాక్స్‌ పేరుతో 18 శాతం, 28 శాతం స్లాబుల్లో ట్యాక్స్‌ వేస్తున్నారు. అయితే ఈ స్లాబ్‌లను మూడుకు తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. 18 శాతం వస్తువులను కూడా 28 శాతానికి చేర్చే అవకాశముంది. లేదా ఇంకాస్త తగ్గించి రెండు స్లాబులను ఒక స్లాబు చేయొచ్చు. అలాగే ఇపుడు అయిదు శాతం, 12 శాతం స్లాబుల నుంచి అదనంగా మరో శాతం పెంచే అవకాశముంది. అంటే ఆరు శాతం, 13 శాతం అవుతుందన్నమాట. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను నవంబర్‌లోగా ఆర్థిక శాఖ తయారు చేస్తుందని ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొంది. డిసెంబర్‌లో జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో ఈ ప్రతిపాదనలపై చర్చ జరుగుతుంది.