13% క్షీణించిన గ్రాన్యూల్స్ లాభం
గ్రాన్యూల్స్ ఇండియా నాలుగో త్రైమా సికంలో రూ.111 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.128 కోట్లతో పోలిస్తే 13 శాతం క్షీణించిందని గ్రాన్యూల్స్ సీఎండీ కృష్ణ చిగురుపాటి తెలిపారు. ఇదే కాలంలో కంపెనీ ఆదాయం 29 శాతం వృద్ధితో రూ.799 కోట్ల నుంచి రూ.1,030 కోట్లకు చేరింది. పూర్తి ఏడాది కంపెనీ రూ. 3765 కోట్ల ఆదాయంపై రూ. 413 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్‌పై 75 పైసలు (75శాతం ) డివిడెండ్‌ను బోర్డు సిఫారసు చేసింది.