మరిన్ని అప్పులు చేయనున్న కేంద్రం
నిన్న ప్రకటించిన ఎక్సైజ్ పన్నులు రాయితీ కారణంగా కేంద్ర ద్రవ్యలోటు పెరగనుంది. ఈలోటు పూడ్చుకునేందుకు మార్కెట్ నుంచి మరిన్ని అప్పులు చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రభుత్వ ప్రస్తుత రాబడులు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (PMGKAY) పథకానికి, ఎరువుల సబ్సిడీకి సరిపోతాయి. తాజాగా పన్ను రాయితీలు కల్పించినందున… ప్రభుత్వ ఆదాయనికి గండి పడుతోంది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గించడం వల్ల కేంద్రానికి లక్షల కోట్ల ఆదాయం తగ్గుతుందని భావిస్తున్నారు. అలాగే సిమెంట్, ప్లాస్టిక్, స్టీల్ రంగాలకు కస్టమ్స్ డ్యూటీలలో ఇచ్చిన వెసులుబాటు కారణంగా మరో రూ.20,000 కోట్ల ఆదాయం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఈలోటు పూడ్చడానికి మరిన్ని అప్పులు చేయాలని భావిస్తోంది.