నేషనల్ ల్యాండ్ మానెటైజేషన్ కార్పొరేషన్ వస్తోంది
బడ్జెట్లో ప్రతిపాదించిన నేషనల్ ల్యాండ్ మానెటైజేషన్ కార్పొరేషన్ (NLMC)ని ఏర్పాటు చేసేందుకు ఆర్థిక శాఖ ముందస్తు కసరత్తు పూర్తి చేసింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల వద్ద ఉన్న భూమిని తీసుకుని వాటిని ఈ కార్పొరేషన్ మానెటైజ్ చేస్తుంది. అమ్మకం అనే పదం వాడకున్నా.. ప్రైవేట్ కంపెనీలకు 60 నుంచి 80 ఏళ్ళ వరకు లీజుకు ఇవ్వడమంటే… దాదాపు అమ్మేసినట్లే భావించాలి. లీజుకు లేదా అద్దెకు లేదా మరో మానెటైజేషన్ పద్ధతిలో ఈ భూములు ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. NLMCని రూ. 5000 కోట్ల ఆధీకృత మూలధనంతో రూ. 150 కోట్ల సబ్స్క్రయిబ్డ్ క్యాపిటల్‌తో ప్రారంభిస్తారు. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల వద్ద నిరుపయోగంగా ఉన్న 3500 ఎకరాలను ఈ కార్పొరేషన్‌కు తరలిస్తారు. ఈ మొత్తం ప్రక్రియకు సంబంధించిన కేబినెట్ నోట్‌ను ఆర్థిక శాఖ రెడీ చేసింది. త్వరలోనే కేబినెట్ ముందు పెట్టనున్నారు.