For Money

Business News

40 ఏళ్ళ కనిష్ఠానికి పీఎఫ్‌ వడ్డీ రేటు

ఉద్యోగుల ప్రావిడెండ్‌ ఫండ్‌పై వడ్డీ రేటును 8.1 శాతానికి తగ్గించాలన్న ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2021-22 సంవత్సరానికి పీఎఫ్‌ మొత్తంపై 8.1 శాతం వడ్డీ చెల్లిస్తారు. అంతకుమునుపు 8.5 శాతం వడ్డీ చెల్లించేవారు. వడ్డీ రేటు తగ్గిస్తూ గత మార్చిలోనే EPFO నిర్ణయం తీసుకుంది. దీనికి ఇవాళ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రభుత్వం నిర్ణయంతో ఉద్యోగల పీఎఫ్‌ వడ్డీ రేట్లు 40 ఏళ్ళ కనిష్ఠానికి పడింది. ఇంతకుమునుపు 1977-78లో కేంద్ర ప్రభుత్వం పీఎఫ్‌పై 8 శాతం వడ్డీ చెల్లించారు. పీఎఫ్‌ సొమ్మును పర్యవేక్షించే ఈపీఎఫ్‌ఓ 85 శాతం నిధులను రుణ సాధనాల్లో, 15 శాతం ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌లో పెడుతోంది. ఈ రెండింటి నుంచి వచ్చే ప్రతిఫలం తగ్గడంతో పీఎఫ్‌ వడ్డీ రేటును తగ్గిస్తున్నారు.