ఐడీబీఐ బ్యాంక్ అమ్మకానికి ఆర్బీఐ ఓకే
మోడీ ప్రభుత్వం ఎలాగైనా సరే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐడీబీఐ బ్యాంక్‌ను అమ్మేయాలని కృతనిశ్చయంతో ఉంది. ఈ మేరకు ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో రోడ్‌షోలు నిర్వహించిన ప్రభుత్వం… కీలక అంశాలకు సంబంధించి ఆర్బీఐ నుంచి ఆమోదం పొందినట్లు ఇవాళ బిజినెస్ మీడియా పేర్కొంది. ప్రైవేట్ పార్టీలు ఈ బ్యాంకును కొనుగోలు చేస్తే… ఎప్పటిలోగా ప్రమోటర్ల వాటా నిర్ణీయ స్థాయికి తగ్గాలో ఆర్బీఐ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.15 ఏళ్ళుగా పేర్కొన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇపుడు ఎంత వాటా ఉంది? విలీనానికి ఉన్న మార్గాలు, సిండికేట్‌గా బిడ్డర్స్ బిడ్ వేస్తే ఎలా? అన్న అంశాలపై ఆర్బీఐ నుంచి స్పష్టత తీసుకుంది. అలాగే ఐడీబీఐ బ్యాంక్‌లో వాటా తీసుకునేందుకు ప్రైవేట్ ఈ్విటీ ఫండ్స్‌ను కూడా అనుమతించాలని కేంద్రం కోరినట్లు తెలుస్తోంది. వీటన్నింటికి ఆర్బీఐ నుంచి అనుమతి వచ్చిందని… వచ్చే నెలలో ఆసక్తి గల కంపెనీల నుంచి బిడ్స్ ఆహ్వానిస్తారని తెలుస్తోంది. మార్చిలోగా ఫైనాన్షియల్ బిడ్స్ కూడా పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇదంతా పూర్తయితే మోడీ ప్రభుత్వంలో అమ్మకం పూర్తి చేసుకున్న బ్యాంక్ ఐడీబీఐ బ్యాంక్ అవుతుంది.