రూ. 64000లకు చేరువలో…
అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ బలహీనపడటంతో మెటల్స్ ధరలు బాగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా బులియన్ మార్కెట్ దూసుకుపోతోంది. ఇవాళ అమెరికా మార్కెట్లో డాలర్ ఇండెక్స్ 101కు దిగువకు చేరింది. తాజా సమాచారం మేరకు 100.60 వద్ద ట్రేడవుతోంది. దీంతో బులియన్ మార్కెట్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. అమెరికాలో ఔన్స్ బంగారం ధర 2100 డాలర్లను ఏక్షణమైనా టచ్ చేసే అవకాశముంది. మన మార్కెట్ రూపాయి కూడా స్థిరంగా ఉండటంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 63,860కి చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,550ని తాకింది. మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో పది గ్రాముల స్టాండర్డ్ బంగారం ధర ఇవాళ 63,640ని తాకింది. ఇది 2024 ఫిబ్రవరి కాంట్రాక్ట్ ధర. క్రితం ముగింపుతో పోలిస్తే ఇవాళ ధర రూ. 615లు పెరిగింది. ఎంసీఎక్స్‌లో వెండి కిలో ధర రూ. 75610ని తాకింది.