For Money

Business News

నిలకడగా వాల్‌స్ట్రీట్‌

అమెరికా స్టాక్‌ మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నా… లాభాలు మాత్రం నామమాత్రంగానే ఉన్నాయి. ఏ క్షణమైనా నష్టాల్లోకి వెళ్ళే అవకాశముంది. మూడు ప్రధాన సూచీలు క్రితం ముగింపు వద్దే ఉన్నాయి. ఒక్క డౌజోన్స్‌ మాత్రమే 0.2 శాతం లాభంతో ఉంది. టెక్‌ షేర్లలో జోష్‌ లేదు. మార్కెట్‌ను ఉత్తేజ పరిచే అంశాలు లేకపోవడంతో పాటు ఇన్వెస్టర్లు ఇయర్‌ ఎండ్‌ హాలిడేస్‌కు వెళ్ళడంతో మార్కెట్లు స్తబ్దుగా ఉన్నాయి. మరోవైపు డాలర్‌ పతనం కొనసాగుతోంది. డాలర్‌ ఇండెక్స్‌ 101 దిగువకు వచ్చింది. దీంతో బులియన్‌ ధరలు భారీగా పెరుగుతున్నాయి. మరోవైపు క్రూడ్‌ ఆయిల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.