ఈసారి గోల్డ్ సేవింగ్ అకౌంట్స్?
కొత్త బడ్జెట్లో గోల్డ్ సేవింగ్ అకౌంట్స్ గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేస్తారని వార్తలు వస్తున్నాయి. దేశ కరెంటు ఖాతాలోటు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని పరిశీలిస్తోంది. క్రూడ్, బంగారం దిగుమతుల కారణంగా మన దేశం కరెంట్ అకౌంట్ లోటు అధికంగా ఉంది. క్రూడ్ ఆయిల్ దిగుమతులకు ప్రత్యామ్నాయం లేదు. దీంతో బంగారానికి ప్రత్యామ్నాయ గురించి ఆలోచిస్తోంది. దీని ప్రకారం బ్యాంకుల్లో ప్రజలు గోల్డ్ సేవింగ్ ఖాతాను ప్రారంభించుకోవచ్చు. డబ్బు ఆ ఖాతాలో వేసుకోవచ్చు. తిరిగి తీసుకునేటపుడు అపుడు బంగారం ధర ఎంత ఉంటుందో అంత తీసుకోవచ్చు. ప్రస్తుతం అనేక జ్యువలరీ షాపులు ఇలాంటి ఆఫర్‌ను ఇస్తున్నాయి. పైగా సావరిన్ గోల్డ్ బాండ్లపై వడ్డీ ఇచ్చినట్లు ప్రభుత్వం ఈ సేవింగ్స్ ఖాతాపై కూడా ప్రభుత్వం వడ్డీ ఇస్తుంది. పూర్తి వివరాల కోసం బడ్జెట్ వరకు ఆగాల్సిందే. అలాగే డిజిటల్ గోల్డ్‌కు సంబంధించిన విధి విధానాలను కూడా బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించవచ్చు.