For Money

Business News

2021లో 1,067 టన్నుల బంగారం దిగుమతి

గత సంవత్సరం (2021) భారత్‌ బంగారం దిగుమతులు 1,067.72 టన్నులకు చేరాయని జెమ్‌ అండ్‌ జువెలరీ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (జీజేఈపీసీ) తెలిపింది. కరోనా సంక్షోభం కారణంగా 2020లో దిగుమతులు కేవలం 430.11 టన్నులకు పడిపోయాయి. 2021లో మన దేశంలోకి స్విట్జర్లాండ్‌ (469.66 టన్నులు) నుంచి అధికంగా బంగారం దిగుమతి కావడం విశేషం. ఆ తర్వాత స్థానాల్లో యూఏఈ (120.16 టన్నులు), దక్షిణాఫ్రికా (71.68 టన్నులు), గినియా (58.72 టన్నులు) ఉన్నాయి. బంగారం దిగుమతులు ఈ స్థాయిలో పెరగడానికి కారణం వైరస్‌ తగ్గడమేనని జీజేఈపీసీ చైర్మన్‌ కొలిన్‌ షా పేర్కొన్నారు. కాని ప్రస్తుత ఆర్థిక సంవ‌త్సరం (2021-22)లో బంగారం దిగుమ‌తులు నెల‌వారీగా సాధార‌ణ స్థాయికంటే త‌క్కువ‌గా ఉన్నాయ‌ని ఆయన తెలిపారు. 2021 ఏప్రిల్‌-2022 ఫిబ్రవ‌రి మ‌ధ్య స‌గటున ప్రతి నెలా 76.57 ట‌న్నుల బంగారం దిగుమ‌తి అయింది. ఇది సాధార‌ణ స్థాయికి త‌క్కువే.