For Money

Business News

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై అందరి దృష్టి

బ్యాంకింగ్‌ రంగ షేర్లలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రేజ్‌ వేరు. కాని ఇది ఏడాది కిందటి మాట. ప్రస్తుత ర్యాలీకి చాలా దూరంగా ఉన్న కౌంటర్‌ ఇది. అనేక మంది ఇన్వెస్టర్లను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఫిన్‌టెక్‌ రంగంలోకి అనే కంపెనీలు రావడం, బ్యాంక్‌ షేర్‌ అప్పటికే భారీగా పెరిగిందన్న ప్రచారంతో పాటు ఆర్బీఐ విధించిన పలు ఆంక్షలు కారణంగా ఈ షేర్‌ ప్రస్తుత ర్యాలీలో పాల్గొనలేదు. ఏకాస్త పెరిగినా…వెంటనే అమ్మకాల ఒత్తిడి వస్తోంది. పైగా ఈ బ్యాంక్‌ క్యాపిటల్‌లో విదేశీ ఇన్వెస్టర్లకు భారీగా వాటా ఉండటం మరోకారణం. ఈ నేపథ్యంలో గతవారం బ్యాంకుకు ఆర్బీఐ నుంచి భారీ ఊరట లభించింది. డిజిటల్‌ వ్యాపారంపై వచ్చిన ఫిర్యాదుల కారణంగా గతంలో ఈ వ్యాపారాలపై నియంత్రణ విధిస్తూ జారీ చేసిన ఆదేశాలను ఆర్బీఐ ఎత్తేసింది. గడిచిన రెండేండ్లుగా సాంకేతిక విభాగంలో తలెత్తిన సమస్యల కారణంగా గతేడాది చివర్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుల జారీపై రిజర్వుబ్యాంక్‌ నియంత్రణ విధించిన విషయం తెలిసిందే. బ్యాంక్‌ డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంలో భాగంగా ప్రకటించిన ‘డిజిటల్‌ 2.0’ పథకానికి ఊరట లభించినట్లు అయింది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో ఈ కౌంటర్‌లో ఇప్పటికైనా ర్యాలీ ప్రారంభమౌతుందా అన్నది చూడాలి.