భారీగా క్షీణించిన బంగారం, వెండి
అంతర్జాతీయ మార్కెట్‌లో బులియన్ ధరలు భారీగా క్షీణించాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంశాన్ని మార్కెట్ డిస్కౌంట్ చేసేసింది. పైగా స్టాక్ మార్కెట్ పరుగుల కారణంగా ఇన్వెస్టర్లు బంగారం పెట్టుబడి తగ్గించారు. ఫలితంగా అమెరికా మార్కెట్‌లో బంగారం, వెండి 1.5 శాతం నుంచి ఒక శాతం వరకు తగ్గింది. ఇదే సమయంలో డాలర్‌క తగ్గడంతో మన మార్కెట్‌పై ప్రభావం అధికంగా పడింది. ఎందుకంటే డాలర్ పడితే భారత కరెన్సీ పెరుగుతుంది. దీంతో బులియన్ ధరలు మరింత తగ్గుతాయి. తాజా సమాచారం మేరకు ఎంసీఎక్స్‌లో అక్టోబర్ డెలివరీ ఫ్యూచర్స్ రూ. 637 తగ్గి రూ.46,672 వద్ద ట్రేడవుతోంది. ఇక కిలో వెండి ధర రూ. 430 తగ్గి రూ.61,180 వద్ద ట్రేడవుతోంది. మన బులియన్ స్పాట్ మార్కెట్లు ఇప్పటికే మూసి ఉన్నాయి. కాబట్ట రేపు ఉదయం తగ్గింపు ధరలతో స్పాట్ మార్కెట్ ప్రారంభమౌతోంది.