For Money

Business News

GMR పవర్‌లోకి GMR గ్రీన్‌

జీఎమ్మార్‌ గ్రీన్‌ ఎనర్జీలో వంద శాతం వాటాను జీఎమ్మార్‌ పవర్‌ అండ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రా కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు జీఎమ్మార్‌ సోలార్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చేతిలో జీఎమ్మార్‌ గ్రీన్‌ ఉంది. దేశీయ గ్రీన్‌ ఎనర్జీ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో జీఎమ్మార్‌ గతేడాది జీఎమ్మార్‌ గ్రీన్‌ ఎనర్జీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జీజీఈపీఎల్‌లో రూ.10 ముఖ విలువ కలిగిన 50 వేల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. ఈ టేకోవర్‌కు ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతి పొందాల్సిన అవసరం లేదు.