For Money

Business News

ఇక క్రిప్టోలపై ఇలా టీడీఎస్‌ కట్‌ చేస్తారు

వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తులు లేదా క్రిప్టోలపై టీడీఎస్‌ కట్‌ చేయడానికి రంగం సిద్ధం అయింది. దీనికి సంబంధించిన విధివిధానాలు ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. దీని ప్రకారం వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తుల బదిలీ తేదీ, చెల్లింపు విధానం వంటి వివరాలన్నీ సంబంధిత ఎక్స్ఛేంజిలు ప్రకటించాల్సిఉంటుంది. ఏడాదికి రూ.10 వేలు పైబడిన డిజిటల్‌ ఆస్తులపైనా లేదా క్రిప్టో కరెన్సీ చెల్లింపులపై ఒక శాతం టీడీఎస్‌ మినహాయించాల్సి ఉంటుంది. జూలై ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తోంది. సెక్షన్‌ 194 ఎస్‌ కింద మినహాయించిన టీడీఎస్‌ను ఆ నెల చివరి తేదీ నుంచి 30 రోజుల్లోగా ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ఛేంజిల ద్వారా జరిగే లావాదేవీలపై పన్ను వసూలు బాధ్యత పూర్తిగా సంబంధిత ఎక్స్ఛేంజిదే అవుతుంది. ఇన్వెస్టర్లు ప్రత్యక్షంగా నిర్వహించే లావాదేవీఅన్నీ టీడీఎస్‌ పరిధిలోకే వస్తాయి.