For Money

Business News

జీఎంఆర్‌ పవర్‌… నో బయర్స్‌

జీఎంఆర్‌ గ్రూప్‌నకు చెందిన జీఎంఆర్‌ పవర్‌ అండ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రా కంపెనీ ఇవాళ స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయింది. ఈ షేర్‌ ఇపుడు 5.88 శాతం నష్టంతో రూ. 45.60 వద్ద ట్రేడవుతోంది. జీఎంఆర్‌ గ్రూప్‌ తన ఇన్‌ఫ్రా కంపెనీని రెండు విభజించిన విషయం తెలిసిందే. ఎయిర్‌ పోర్ట్‌ వ్యాపారంతో జీఎంఆర్‌ ఇండస్ట్రీస్‌, విద్యుత్‌, ఇతర వ్యాపారలను జీఎంఆర్‌ పవర్‌ కిందకు తెచ్చింది. ఇలా విడగొట్టి కొత్త రూపొందించిన జీఎంఆర్‌ పవర్‌ ఇవాళ లిస్టయింది. అయితే ఈ షేర్‌లో ఎవరూ కొనుగోలుదారులు లేరు. దీనికి ప్రధాన కారణంగా ఈ షేర్‌ ట్రేడ్‌ టు ట్రేడ్‌ కేటగిరిలో అంటే టీ గ్రూప్‌లో ఉంటుంది. సాధారణంగా డే ట్రేడర్స్‌ ఈ షేర్‌ జోలికి వెళ్ళరు. షేర్లు కొన్న తరవాత షేర్లు తమ ఖాతాలోకి వచ్చిన తరవాతే అమ్మాల్సి ఉంటుంది. స్క్వేర్‌ ఆఫ్‌ ఛాన్స్‌ ఉండదు. అయితే టీ గ్రూప్‌లో ఈ షేర్‌ 10 రోజులు ఉంటుంది. తరవాత ఈ గ్రూప్‌ నుంచి బయటకు వస్తుంది. బహుశా అపుడైమైనా ఈ షేర్‌లో యాక్టివిటీ పెరగొచ్చు. ఈ కంపెనీ చేతిల 4.8 గిగా వ్యాట్స్‌ పవర్‌ ప్లాంట్లు ఉన్నాయి. ఇందులో 2.8 గిగా వాట్ల శక్తి ఉన్న పవర్‌ ప్లాంట్లు పనిచేస్తున్నాయి. ఈ కంపెనీకి గుజరాత్‌లో ఒకటి, ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో మరో సోలార్ ప్లాంట్‌ ఉంది.