For Money

Business News

హీరో మోటో కార్ప్‌పై ఐటీ దాడులు

ప్రముఖ టూవీలర్‌ కంపెనీ హీరో మోటోకార్ప్‌కు చెందిన ఆఫీసులతో పాటు ఆ కంపెనీ ప్రమోటర్‌ పవన్‌ ముంజల్‌ ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి ఐటీ దాడులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 24 చోట్ల దాడులు జరుగుతున్నాయి. కంపెనీకి చెందిన ఉన్నతాధికారుల గృహాలపై కూడా దాడులు జరుగుతున్నట్లు సమాచారం. పన్నులు ఎగవేశారన్న అనుమానంతో ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.