For Money

Business News

సగానికి తగ్గిన జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా నష్టం

డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రూ.515.34 కోట్ల కన్సాలిడేటెడ్‌ నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాదిలో ఇదే కాలానికి నమోదైన రూ.1,120.51 కోట్ల నష్టంతో పోలిస్తే మాత్రం గణనీయంగా తగ్గింది. కంపెనీ ఆదాయం మాత్రం రూ.1,437.84 కోట్లకు పెరిగింది. కరోనా సంక్షోభం గ్రూప్‌పై, ప్రధానంగా ఎయిర్‌పోర్టుల నిర్వహణ కార్యకలాపాలపై ప్రభావం చూపిందని జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా యాజమాన్యం పేర్కొంది. తమ అనుబంధ కంపెనీ జీఎంఆర్‌ సెజ్‌ అండ్‌ పోర్ట్‌ హోల్డింగ్స్‌కు కాకినాడ సెజ్‌ లిమిటెడ్‌లోని 51 శాతం వాటాను అరబిందో రియల్టీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అమ్మనుంది. ఈ మేరకు రెండు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది.ఈ ఒప్పందంలో భాగంగా కాకినాడ గేట్‌వే పోర్ట్‌ లిమిటెడ్‌లో సెజ్‌కు ఉన్న 74 శాతం వాటాను కూడా అరబిందో రియాల్టికి బదిలీ చేసినట్లు జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలిపింది.