For Money

Business News

అరబిందో లాభం 22% డౌన్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికానికి అరబిందో ఫార్మా రూ.604.3 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి నమోదైన రూ.777 కోట్ల లాభంతో పోలిస్తే 22.3 శాతం క్షీణించింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసిక నికరలాభం రూ.696.7 కోట్లతో పోల్చినా 13.3 శాతం తగ్గింది. ముడిసరుకులు, రవాణా వ్యయం భారీగా పెరగడం మూడో త్రైమాసిక లాభాలు తగ్గాయని అరబిందో ఫార్మా వైస్‌ చైర్మన్‌, ఎండీ కే నిత్యానంద రెడ్డి తెలిపారు. అమెరికా ఫార్ములేషన్ల విభాగ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 13.4 శాతం తగ్గి రూ.2,745.2 కోట్లకు పడిపోయింది. క్యూ3లో అమెరికా ఔషధ నియంత్రణ మండలి USFDA వద్ద 3 ఇంజెక్టిబుల్స్‌ సహా మొత్తం 10 కొత్త ఔషధాలకు దరఖాస్తు (ఏఎన్‌డీఏ) చేసినట్లు అరబిందో ఫార్మా తెలిపింది. వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.1.50 మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించింది.