For Money

Business News

రూ.1110 కోట్లు సమీకరణ

జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ కంపెనీ రూ. 1110 కోట్లను సమీకరించింది. మోర్గాన్‌ స్టాన్లీ ఇండియా ప్రైమరీ డీలర్‌ నుంచి ఈ మొత్తం సమీకరించింది. ఈనెల 24వ తేదీన పలు బాండ్లను తిరిగి చెల్లించాల్సి ఉంది. ఈ చెల్లింపుల కోసం తాజాగా నిధులు సమీకరించినట్లు తెలుస్తోంది. డీబీ ఇంటర్నేషనల్‌, స్టాండర్డ్‌ ఛార్టెడ్‌ బ్యాంక్‌, ఆదిత్య బిర్లా స్పెషల్‌ సిట్యుయేష్‌ ఫండ్‌లకు జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్‌ రూ. 1330 కోట్లు చెల్లించాల్సి ఉంది. రెండేళ్ళ కాల వ్యవధి ఉన్న ఈ బాండ్లను కంపెనీ చెల్లించినట్లు తెలుస్తోంది.