For Money

Business News

భారీ లాభాల్లో సింగపూర్‌ నిఫ్టి

దిగువస్థాయిలో మద్దతు అందడంతో రాత్రి వాల్‌స్ట్రీట్‌ భారీ లాభాలతో ముగిసింది. గత కొన్ని రోజులుగా వరుస నష్టాల్లో కంగారు పెట్టించిన సూచీలు రాత్రి రెండు శాతం దాకా పెరిగాయి. నాస్‌డాక్‌, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలు 2 శాతం లాభపడగా, డౌ జోన్స్‌ కూడా 1.88 శాతం లాభపడటం విశేషం. రాత్రి కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ చల్లబడింది. డాలర్‌ ఇండెక్స్‌ 114 నుంచి 113కి దిగి వచ్చింది. ఇదే సమయంలో క్రూడ్‌ ఆయిల్‌ అనూహ్యంగా కోలుకుంది. ఏకంగా 88 డాలర్లను దాటేసింది. అంతకుముందు యూరో మార్కెట్లు కూడా నష్టాల నుంచి గ్రీన్‌లోకి వచ్చాయి. అయితే స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. వాల్‌స్ట్రీట్‌ దూకుడు ప్రభావం ఆసియా మార్కెట్లపై కన్పిస్తోంది. దాదాపు అన్ని మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. జపాన్‌, హాంగ్‌సెంగ్‌ నుంచి తైవాన్‌ వరకు అన్ని సూచీలు ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. సింగపూర్ నిఫ్టి కూడా 165 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. సో… నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే 17000 స్థాయిని దాటే అవకాశముంది.