22-23లో జీడీపీ వృద్ధి రేటు 8 %- 8.5%
వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2022-23లో దేశ స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 8 శాతం లేదా 8.5 శాతం ఉండొచ్చని కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడించింది. 2021-22 ఏడాదికి ఆర్థికసర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ కొద్దిసేపటి క్రితం పార్లమెంటుకు సమర్పించారు. ఆర్థిక సర్వేలోని కీలక అంశాలను బ్లూమ్బర్గ్ వార్తా సంస్థ వెల్లడించింది. 2021-22లో జీడీపీ వృద్ధి రేటు 9.2 శాతం ఉంటుందని అంచనా వేసింది. అంటే వచ్చే జీడీపీ వృద్ధిరేటు తగ్గనుందన్నమాట. 2021-22 అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగ వృద్ధి రేటు 3.9 శాతం, పారిశ్రామిక వృద్ధిరేటు 11.8 శాతం ఉంటుందని ఎకానమిక సర్వే వెల్లడించింది. అలాగే సర్వీసెస్ రంగం వృద్ధి రేటు 8.2 శాతం ఉండొచ్చని పేర్కొంది.