గోల్డ్… పడితే కొనండి
ఫ్యూచర్స్ మార్కెట్లో బులియన్ గ్రీన్‌లో ప్రారంభమైంది. జనవరి పది గ్రాముల స్టాండర్డ్ బంగారం కాంట్రాక్ట్ ఇవాళ రూ. 54900 వద్ద ప్రారంభమైంది. ఇపుడు రూ. 54987ని తాకిన తరవాత రూ.15968 వద్ద ట్రేడవుతోంది. ఇవాళ్టి డే ట్రేడింగ్‌కు ఈ కాంట్రాక్ట్‌కు 55000 స్థాయి కీలకం. దిగువన నిఫ్టికి 54834 వద్ద మద్దతు ఉంది. రూ.54805 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చు. ఈ కాంట్రాక్ట్ 55,000 స్టాయిని పటిష్ఠంగా దాటితే 55199 దాకా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ముందుకు సాగే అవకాశముంది. అయితే గట్టి ర్యాలీ రావాలంటే మాత్రం55272ని దాటాలి. రిస్క్ వొద్దనుకునేవారు 55228 ప్రాంతంలో బయటపడొచ్చు. వెండి విషయంలో పెరిగితే అమ్మమనే టెక్నికల్ అనలిస్టులు సలహా ఇస్తున్నారు. ఫిబ్రవరి కాంట్రాక్ట్ 70,152 దాటితేనే కొనుగోలు చేయాలని సలహా ఇస్తున్నారు.