పేటీఎంకు మరో షాక్
పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు మరో షాక్ తగిలింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (FIU) రూ.5.49 కోట్ల జరిమానా విధించింది. మనీలాండరింగ్ చట్టం నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ జరిమానా విధించినట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. పేటీఎం పేమెంట్ బ్యాంక్‌కు సంబంధించి ఆన్లైన్ గేమింగ్‌తో పాటు ఇతర పలు అనైతిక కార్యకలాపాలకుపాల్పడినట్లు దర్యాప్తు సంస్థల నుంచి FIUకి సమాచారం అందుకుంది. ఇతర సంస్థలపైనా కూడా ఇలాంటి సమచారం వచ్చింది. వీటిని సమీక్షించిన తరవాత పేటీఎంపై భారీ మొత్తంలో జరిమానా విధించింది. చట్ట విరుద్ధమైన కార్యకలాపాల నుంచి వచ్చిన సొమ్మును పలు సంస్థలు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నిర్వహిస్తున్న బ్యాంకు ఖాతాల నుంచి మళ్లించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.