అమ్మకానికి గ్లాండ్ ఫార్మా
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న గ్లాండ్ ఫార్మా అమ్మకానికి పెట్టారు. ఈ కంపెనీలో చైనాకు చెందిన ఫోసన్ ఫార్మాకు 57.86 శాతం వాటా ఉంది. ఫోసన్ ఫార్మా మాతృ సంస్థ అయిన ఫోసన్ ఇంటర్నేషనల్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో… గ్లాండ్ ఫార్మాలో వాటాను అమ్మాలని భావిస్తోంది. దీంతో మార్కెట్‌లో పరిస్థితి ఎలా ఉంది? కంపెనీలో తమ వాటా అమ్మితే ఎంత వచ్చేలా ఉంది? వంటి అంశాలను పరిశీలించేందుకు ఒక అడ్వయిర్‌ను నియమించింది. 2017లో వివిధ సంస్థల నుంచి 110 కోట్ల డాలర్లకు గ్లాండ్ ఫార్మాను ఫోసన్ ఫార్మాకొనుగోలు చేసింది. 2020 నవంబర్‌లో ఈ కంపెనీని స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ చేశారు. అప్పట్లో పబ్లిక్ ఆఫర్ కింద ఒక్కో షేర్ రూ. 1500లకు ఆఫర్ చేశారు.ఈ ఏడాది జవనరి6వ తేదీ ఈ షేర్ రూ.4062లకు చేరింది. ఇదే ఆల్ టైమ్ హై. అక్కడి నుంచి పడుతూ వచ్చి ఈ ఏడాది నవంబర్ 10న రూ.1660కు క్షీణించింది. నిన్న ఈ షేర్ రూ. 1745 ఉండేది. ఇవాళ వాటా అమ్మకం వార్తను బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థ వెల్లడించడంతో ఈ షేర్ పది శాతం దాకా పెరిగి రూ. 1908ని తాకింది. చివరికి 7.7 శాతం లాభంతో రూ. 1880 వద్ద ముగిసింది. ప్రస్తుత ధర వద్ద ఈ కంపెనీలో వాటా అమ్మితే ఫోసన్‌కు 335 కోట్ల డాలర్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. దాదాపు చాలా ఫార్మా కంపెనీల ధరలు బాగా తగ్గాయి. ప్రస్తుత ధరల వద్ద మంచి డిమాండ్ ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. మంచి గ్రూప్ కొనుగోలు చేసే పక్షంలోఈ షేర్‌కు మంచి భవిష్యత్ ఉండదనుంది. ఈ అమ్మకం వార్త రాకముందు కూడా ఈ కంపెనీ షేర్‌ను చాలా మంది బ్రోకర్లు కొనుగోలు చేయమని సలహా ఇస్తున్నారు. 18 మంది బ్రోకర్లలో 12 మంది కొనుగోలుకు లేదా కచ్చితంగా కొనుగోలు చేయాల్సింగా సిఫారసు చేసినట్లు ఎకనామిక్ టైమ్స్ పత్రిక పేర్కొంది.