20 శాతం క్షీణించిన ఫోర్టిస్ హెల్త్‌కేర్
సుప్రీం కోర్టు నుంచి సానుకూల తీర్పు వస్తుందనే ఆశతో మొన్ననే రూ.325లను తాకింది ఫోర్టిస్ హెల్త్ కేర్ షేర్. ఇది 52 వారాల గరిష్ఠ స్థాయి కూడా. ఈ హాస్పిటల్‌ను మలేషియాకు చెందిన ఐహెచ్‌హెచ్ టేకోవర్ చేసిన విషయం తెలిసిందే. ఆ కంపెనీ చేసిన ఓపెన్ ఆఫర్‌ను సుప్రీం కోర్టు స్టే విధించింది. ఇవాళ ఈ కేసు విచారణను చేపట్టిన కోర్టు స్టే కొనసాగించాలని ఆదేశించింది. అలాగే ఓపెన్ ఆఫర్ విషయంలో ముందుకు వెళ్ళవద్దని పేర్కొంది. ఈ కేసు విషయం చూడాల్సిందిగా ఢిల్లీ హైకోర్టును ఆదేశించింది. 2018లో మలేషియాకు చెందిన ఐహెచ్ఎచ్ 110 కోట్ల డాటర్లకు ఈ హాస్పిటల్లో 31 శాతం వాటాను కొనుగోలు చేసింది. మరో 26 శాతం వాటాకు ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. అయితే జపాన్‌కు చెందిన దైచి శాంక్యో ఈ డీల్‌ను కోర్టులో ఛాలెంజ్ చేసింది. ఈ హాస్పిటల్ పాత ప్రమోటర్లయిన మాల్విందర్ సింగ్, శివిందర్ సింగ్‌లు తమకు రూ. 3600 కోట్లు బకాయి ఉన్నారని.. ఆ సంగతి తేల్చాలని కోర్టును ఆశ్రయించింది. దీంతో ఫోర్టిస్ హెల్త్‌కేర్ షేర్ 20 శాతం తగ్గి రూ. 250.35ని తాకింది. క్లోజింగ్‌లో స్వల్పంగా కోలుకుని 15 శాతం నష్టంతో రూ. 264.80 వద్ద ముగిసింది.