For Money

Business News

అరబిందో చేతికి క్రోనస్‌ ఫార్మా స్పెషాలిటీస్‌

హైదరాబాద్‌కు చెందిన వెటర్నరీ ఔషధాల సంస్థ క్రోనస్‌ ఫార్మాస్పెషాలిటీస్‌ను అరబిందో ఫార్మా టేకోవర్‌ చేసింది. ఈ కంపెనీ లో రూ.420 కోట్లతో 51 శాతం వాటాను కొనుగోలు చేసింది. దీనికి గాను నగదు బదలు అరబిందో ఫార్మాకు కొత్త షేర్లను జారీ చేస్తారు. జెనరిక్‌ వెటర్నరీ ఔషధాల అభివృద్ధి, ఉత్పత్తి, విక్రయా ల్లో క్రోనస్‌ ఫార్మా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2015లో ఏర్పాటైన ఈ కంపెనీ టర్నోవర్‌ 2020-21 లో రూ.11.4 కోట్లు. రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్‌ను రూ.34.18 ప్రీమియంతో కొనుగోలు చేసింది అరబిందో. జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి అరబిందో ఫార్మా రూ.770 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. టర్నోవర్‌ రూ.5,702 కోట్లకు చేరిందని కంపెనీ వెల్లడించింది. వాటాదారులకు 150 శాతం మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించింది.