ఆర్ఆర్‌ఆర్: పే-పర్-వ్యూ రిలీజ్?
భారీ బడ్జెట్‌తో తీసిన ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ఈనెల 25న విడుదల అవుతోంది. భీమ్లా నాయక్ మినహా మిగిలిన హిందీ, తెలుగు, తమిళ చిత్రాలేవీ సంచలనం సృష్టించలేకపోయాయి. అజిత్ నటించిన వలిమై కూడా తమిళం వరకే ఆగిపోయింది. ఖిలాడీతోపాటు రాధేశ్యామ్ కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చాయి. కాని ఆర్‌ఆర్‌ఆర్ మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని ఇండస్ట్రీ టాక్. అందుకే అన్ని ఫార్మెట్లలో ఈ సినిమా అద్భుతంగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. తమ వద్ద ప్రొడొక్ట్ ఫెంటాస్టిక్‌గా వచ్చినందున… మార్కెటింగ్‌లో ఎక్కడా రాజీ పడటం లేదు. మార్కెటింగ్ ద్వారా ఏర్పడుతున్న హైప్‌ను తట్టుకునేలా మూవీ ఉందని తెలుస్తోంది. అందుకే ఈ సినిమా పే పర్ వ్యూ ఫార్మెట్‌లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. సినిమా థియేటర్లలో విడుదల అయిన 75 రోజుల తరవాత ఓటీటీలో ఈ సినిమా విడుదల కానుంది. ఈలోగా పే పర్ వ్యూ ఫార్మెట్‌లో కూడా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే ఇండస్ట్రీలో ఈ ప్రయోగం చేసిన తొలి చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ అవుతుంది. పే పర్ వ్యూ కింద నిర్ణీత రుసుం చెల్లిస్తే ఒక సినిమాను ఆన్‌లైన్‌లో చూసే హక్కులను 24 గంటల వరకు ఇస్తారు. ఆ తరవాత ఆటోమేటిగ్గా… ఆగిపోతుంది. దీనికి సంబంధించి చిత్ర నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.