పసిపిల్లలకూ కరోనా వ్యాక్సిన్
ఇప్పటి వరకు 5 ఏళ్ళు పైబడినవారికి మాత్రమే కరోనా వ్యాక్సిన్స్ ఉన్నాయి. కొన్ని దేశాల్లో టీనేజర్ల వరకు మాత్రమే కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. అంతకన్నా తక్కువ వయస్కులకు కరోనా ఇవ్వడం లేదు. అయితే అమెరికాలో 5 ఏళ్ళ లోపు పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు రంగం సిద్ధమౌతోంది. 2 నుంచి 4 ఏళ్ళ పిల్లల కోసం ఫైజర్, బయోఎన్‌టెక్ ఎస్ఈ కంపెనీలు వ్యాక్సిన్లను తయారు చేశాయి. ఈ వ్యాక్సిన్లను అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ పరిశీలనకు పంపాయి. వారంలోగా ఈ వ్యాక్సిన్లపై ఎఫ్‌డీఏ నిర్ణయం తీసుకునే అవకాశముంది. పిల్లలకు రెండు డోసుల్లో వ్యాక్సిన్ వేసేందుకు అత్యవసర అనుమతి ఇవ్వాల్సిందిగా ఎఫ్‌డీఏను కంపెనీలు కోరుతున్నాయి. వీరి కోసం ప్రత్యేకంగా 3 మైక్రోగ్రామ్ డోస్‌లను కంపెనీలు సిద్ధం చేశాయి. 5 నుంచి 10 ఏళ్ళ లోపు పిల్లకు పది మైక్రోగ్రాముల డోస్‌లు వేస్తున్నారు. 12 ఏళ్ళు దాటినవారికి 30 మైక్రోగ్రామ్ డోస్‌లు వేస్తున్నారు.