ఫెడ్ ఫినా పబ్లిక్ ఆఫర్
ఫెడరల్ బ్యాంక్‌కు చెందిన ఫైనాన్షియల్ సర్వసెస్ విభాగం (ఫెడ్ ఫినా) త్వరలోనే పబ్లిక్ ఆఫర్‌కు రానుంది. గోల్డ్ లోన్, హోమ్‌లోన్, బిజినెస్ లోన్‌తోపాటు ఆస్తుల తాకట్టు పై రుణాలు ఇచ్చే వ్యాపారంలోఉన్న ఫెడ్ ఫినా రూ.6000 కోట్ల నుంచి రూ. 7000 కోట్ల వ్యాల్యూయేషన్ కోరుతోంది. ఫిబ్రవరి 12లోగా సెబీ వద్ద ప్రాస్పక్టస్‌ను దాఖలు చేయనుంది. దీనికి సంబంధించిన ప్రక్రియకు ఫెడరల్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు ఓకే చేసినట్లు సమాచారం. పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ.2000 కోట్లు సమీకరించాలని ఫెడ్ ఫినా భావిస్తోంది. రూ.1000 కోట్లకు కొత్త షేర్లను జారీ చేస్తారు. మరో రూ.1000 కోట్ల విలువైన షేర్లను బ్యాంక్, మరో ఇన్వెస్టర్ అమ్ముతారు. అంటే ఆఫర్ ఫర్‌సేల్ అన్నమాట. ఫెడ్ఫినాలో 74 శాతం వాటా ఫెడరల్ బ్యాంక్‌కు ఉంది. మిగిలిన 26 శాం ట్రూ నార్త్ ఫండ్ VI ఎల్ఎల్పీ కంపెనీకి ఉంది.