మార్చిలో వడ్డీ రేట్లను పెంచుతాం
దేశంలో ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతున్నందున మార్చి నెలలో వడ్డీ రేట్లను పెంచే అవకాశముందని అమెరికా ఫెడరల్ రిజర్వ్ పేర్కొంది. రెండు రోజుల భేటీ తరవాత ఫెడరల్ రిజర్వ్ చీఫ్ జెరోమ్ పావెల్ మీడియాతో మాట్లాడారు. ద్రల్యోల్బణ కట్టడికి బ్యాంక్ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వడ్డీ రేట్లు పెంచేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. అనేక అంశాలపై తుది నిర్ణయం తీసుకోలేదని, వడ్డీ రేట్లను ఎంత వేగంగా పెంచాలని, బ్యాంక్ బ్యాలెన్స్‌ను ఎలా తగ్గించాలి అన్న అంశాలపై నిర్ణయం తీసుకోలేదన్నారు. అయితే ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నందున వడ్డీ రేట్లు పెంచాలని అనుకున్నట్లు మాత్రం స్పష్టంగా చెప్పారు.